ఢిల్లీ మెట్రో స్టేషన్ లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఢిల్లీ మెట్రో స్టేషన్ లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏప్రిల్ 4వ తేదీ గురువారం ఉదయం ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. ఉదయం 7 గంటల సమయంలో నగరంలోని నాగ్లోయ్ మెట్రో స్టేషన్‌లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు.  

మెట్రో స్టేషన్‌లో లగేజీ స్కానింగ్ మెషీన్  దగ్గర కానిస్టేబుల్ మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు..కానిస్టేబుల్ తన నుదుటిపై గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వ్యక్తిని..  2014 బ్యాచ్ కానిస్టేబుల్ షహ్రే కిషోర్‌గా గుర్తించారు. 2022 జనవరి నుంచి ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు.