CISFలో హెడ్​ కానిస్టేబుల్ పోస్టులు..జీతం రూ. 25వేల నుంచి 80 వేలు

CISFలో హెడ్​ కానిస్టేబుల్ పోస్టులు..జీతం రూ. 25వేల నుంచి 80 వేలు

స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్​సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే 30. 
పోస్టుల సంఖ్య 30: హెడ్​ కానిస్టేబుల్
(స్పోర్ట్స్ కోటా) 
ఎలిజిబిలిటీ: కేంద్రం లేదా రాష్ట్ర గుర్తింపు పొందిన సంస్థ ద్వారా 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతర్జాతీయ, జాతీయ , రాష్ట్ర స్థాయిలో హాకీలో ప్రతిభ కనబర్చి ఉండాలి. 
వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 23 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్​మెంటల్ సర్వీసులో క్రమం తప్పకుండా మూడేండ్ల సర్వీసు పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు, ఇతరులకు 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఎలాంటి అఫ్లికేషన్ ఫీజు లేదు. 
అప్లికేషన్లు ప్రారంభం: మే 11.
అప్లికేషన్లకు చివరి తేదీ: మే 30.
సెలెక్షన్ ప్రాసెస్: రెండు స్టేజీల వారీగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్టేజ్ –1లో ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్​టీ), డాక్యుమెంటేషన్. స్టేజ్–2లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పూర్తి వివరాలకు cisfrectt.cisf.gov.inవెబ్​సైట్​లో సంప్రదించగలరు.