ఆన్ లైన్ లోన్లపై సిటిజన్స్ ఇంట్రెస్ట్

ఆన్ లైన్ లోన్లపై సిటిజన్స్ ఇంట్రెస్ట్

హైదరాబాద్​,వెలుగు: లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు ఆన్ లైన్ లోన్ల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిటీలో ముఖ్యంగా యువకులే ఎక్కువగా లోన్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో జాబ్స్ లేకపోవడం, 3 నెలలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పు దొరక్కపోవడంతో కొంచెం వడ్డీ ఎక్కువైనా ఆన్ లైన్ లో ఫైనాన్స్ కంపెనీల నుంచి లోన్లు తీసుకుంటున్నారు.

ఇదీ ప్రాసెస్…

లోన్లు పొందాలంటే స్మార్ట్​ఫోన్​లో గూగుల్ ప్లే స్టోర్​ నుంచి ఫైనాన్స్​ కంపెనీల పేరుతో ఉండే యాప్​ని డౌన్​ లోడ్​ చేసుకోవాలి. రిజిస్ర్టేషన్​ చేసుకొని యూజర్ నేమ్, పాస్ వర్డ్ పొందిన తర్వాత లోన్ ప్రాసెస్ స్టార్ట్​ అవుతుంది. ఆ తర్వాత పాన్​ కార్డు, అడ్రస్​ ప్రూఫ్,​ బ్యాంక్​ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. అన్ని కరెక్ట్ గా ఉంటే 10 నిమిషాల్లోనే లోన్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో పడుతుందని పలువురు చెప్తున్నారు.

సిబిల్ స్కోర్ ఉంటేనే..

ఆన్​లైన్​లో ఫైనాన్స్​ బిజినెస్​ చేసే కంపెనీలు సిటీలో 100కు పైగానే ఉన్నాయి. తమ కంపెనీల పేర్లతో ఆన్​లైన్ లో అడ్వర్టయిజ్ చేసుకుంటూ లోన్లు కావాలనుకునే వారు యాప్ ద్వారా పొందవచ్చని సూచిస్తున్నాయి. ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకున్న వారి సిబిల్ స్కోర్ ఆధారంగా రూ.వెయ్యి నుంచి లక్షల్లో లోన్లను నిమిషాల్లో ఫైనాన్స్​ సంస్థలు అందిస్తున్నాయి. వడ్డీ చార్జీలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. కొన్ని సంస్థలైతే కేవలం రోజుల వ్యవధిలోనే చెల్లించమంటుండగా, మరికొన్ని కాస్త సమయాన్ని ఇస్తున్నాయి. ఆన్​లైన్​లోనే చెల్లించాలని చెబుతున్నాయి. ఇక వడ్డీ 15 నుంచి 35 శాతం దాకా వేస్తున్నారు.

అటు నుంచి ఇటు రొటేషన్ చేస్తూ ..

కరోనాతో చాలా మంది నేటికి జాబ్ ల్లో చేరని పరిస్థితి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు క్షణాల్లో లోన్లు అనేసరికి యాప్స్ ద్వారా అప్లయ్ చేసుకుంటున్నారు. ఫైనాన్స్​ కంపెనీలు ఇచ్చిన లోన్లను తీసుకుని తిరిగి చెల్లించే టైమ్ లో డబ్బులు అడ్జస్ట్​ కాక ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం వారు మళ్లీ మరో ఆన్ లైన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకుని పాతవాటిని కట్టేస్తున్నారు. ఇలా అటు నుంచి ఇటు రొటేషన్ చేస్తూ చివరకు పెద్ద మొత్తం జమ కావడంతో చేతులెత్తేస్తున్న వారు కూడా ఉన్నారు. అధిక వడ్డీ ఉండడం, లిమిటెడ్ పీరియడ్ లో చెల్లించాలనే కండీషన్స్ ఉండడంతో అప్పుల్లో కూరుకుపోతున్నట్లు పలువురు యువకులు పేర్కొంటున్నారు.