- జిల్లా కార్యదర్శి కాముని గోపాల్ స్వామి
సిద్దిపేట రూరల్, వెలుగు: కార్మిక హక్కుల సాధన కోసం సీఐటీయూ అలుపెరుగని పోరాటం చేస్తోందని జిల్లా కార్యదర్శి కాముని గోపాల్ స్వామి అన్నారు. సోమవారం కార్మిక కర్షక భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఐటీయూ నాలుగో మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించామన్నారు.
మహాసభల విజయవంతానికి సహకరించిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కార్మికుల కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లుగా ఉన్న ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, వివోలు, ఆర్పీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు.
అసంఘటితరంగా కార్మికులైన హమాలీ, ట్రాన్స్పోర్ట్, బీడీ, భవనిర్మాణ కార్మికులకు సమగ్రమైన చట్టం చేసి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు వారి కుటుంబాలకు విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం 41 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా సందబోయిన ఎల్లయ్య, కార్యదర్శిగా కాముని గోపాలస్వామి, కోశాధికారిగా గొడ్డుబర్ల భాస్కర్, ఉపాధ్యక్షుడిగా శెట్టిపల్లి సత్తిరెడ్డి, ఎం. పద్మ, బండ్ల స్వామి, కాట మధు, సింగిరెడ్డి చంద్రారెడ్డి. సహాయ కార్యదర్శులుగా చొప్పరి రవికుమార్, తునికి మహేశ్, ఇప్పకాయల శోభ, మామిడాల కనకయ్యను ఎన్నుకున్నారు.
