మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె : భూపాల్

మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె : భూపాల్

సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్​లో వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను కాలరాస్తూ పాలకులు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 కనీస వేతనాలను అమలు చేయడం లేదన్నారు. హక్కులు, వేతనాల కోసం కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, సాయిలు, నాయకులు యాదగిరి, ప్రవీణ్, నాగరాజు, యాదయ్య, శోభా, కృష్ణా, శారద, శ్రీనివాస్, లక్ష్మణ్ ఉన్నారు.

సార్వత్రిక సమ్మెను సక్సెస్​ చేయాలి

మెదక్​టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను సక్సెస్​చేయాలని జిల్లా సీఐటీయూ కార్యదర్శి మల్లేశం పిలుపునిచ్చారు. మంగళవారం డీఎంహెచ్​వో, డీడబ్ల్యూవోలకు నోటీసులు అందజేశారు. అనంతరం మల్లేశం మాట్లాడుతూ.. కార్మికవర్గం పోరాటాలతో సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్​లను తీసుకొచ్చి వాటి అమలుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్ సమస్యలు, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం వారిని మోసం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ మెదక్​ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, అంగన్​వాడీ యూనియన్ నాయకురాలు యూసీఫ్, జబిన్​ఫాతిమా, నాగరాణి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.