వేతనాలు పెంచి పర్మినెంట్ చేయండి

వేతనాలు పెంచి పర్మినెంట్ చేయండి
  • వేతనాలు పెంచి పర్మినెంట్ చేయండి
  • సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్

ముషీరాబాద్,వెలుగు: మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వెంటనే జీతాలు పెంచి పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 8 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ పాల్గొని మాట్లాడారు.

కరోనా కాలంలో ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మున్సిపల్ సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు. అలాంటి కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎస్. రమ, మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా నర్సింహులు, ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.