జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి : నర్సమ్మ

జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి : నర్సమ్మ

చిలప్ చెడ్, వెలుగు: గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీవో ఆఫీస్ వద్ద జూనియర్ అసిస్టెంట్ రమేశ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీపీ సిబ్బంది, కార్మికులకు ఏడు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందన్నారు.

 ప్రభుత్వం స్పందించి వేతనాలు వెంటనే చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి సబిత, పంచాయతీ కార్మికులు ప్రభాకర్, మల్లేశం, బందేల్లి, శేఖర్, యాదయ్య, భిక్షపతి, రాములు పాల్గొన్నారు.