కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోదీ సర్కార్ : సాయిబాబు

కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోదీ సర్కార్ : సాయిబాబు

కాగజ్ నగర్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్ మతతత్వ విధానాలను అనుసరిస్తూ అసంఘటిత రంగాలను నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు ఫైర్​ అయ్యారు. , ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ప్రకటించే సమయం వచ్చిందన్నారు. ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం కాగజ్ నగర్  ఎస్​బీఐ బ్యాంక్ ముందు బహిరంగ సభ నిర్వహించాయి.

చీఫ్​ గెస్ట్​గా హాజరైన సాయిబాబా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని చెపుతున్న మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందన్నారు. ఇప్పటికే  దేశంలోని 450 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన కేంద్రం.. రానున్న రోజుల్లో మరిన్ని అప్పగించే ప్రమాదం ఉందన్నారు.

కార్మికులందరికీ కనీస వేతనం, ఉద్యోగ భద్రత, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రైతులు, కార్మికులు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు బి.మధు, వంగూరి రాములు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాదవ్ రాజేందర్, ముంజం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.