ఎంజీబీఎస్ నుంచి ఆటో స్టాండ్ తరలించొద్దు

ఎంజీబీఎస్ నుంచి  ఆటో స్టాండ్ తరలించొద్దు

ఓల్డ్​సిటీ, వెలుగు: మహాత్మా గాంధీ బస్ స్టేషన్​లోని ఆటో స్టాండ్​ను తొలగించవద్దని​ సీఐటీయూ కార్యదర్శి శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎంజీబీఎస్ లో ఆటో యూనియన్​సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 150 మంది ఆటో డైవర్ల జీవన ఉపాధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఊబర్, ఓలా, ర్యాపిడోతో ఉపాధి కోల్పోతున్న తమను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. సమావేశంలో మహ్మద్​బాబా, కోటయ్య,  జంగయ్య పాల్గొన్నారు.