పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ : సిటీ సీపీ సజ్జనార్

పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ  : సిటీ సీపీ సజ్జనార్

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీలో పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ ఇస్తునట్లు సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సోమవారం మాదన్నపేట పోలీస్ స్టేషన్​ను ఆయన సందర్శించారు. వివిధ కేసుల పురోగతి, పోలీసింగ్ విధానాలు, ఇతర అంశాలను సమీక్షించారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌ విధానంతో శాంతి-భద్రతలు, ట్రాఫిక్ భద్రత, మహిళలు, -చిన్నారుల రక్షణ, ఏఐ వాడకం, సైబర్ క్రైమ్, -ఆర్థిక నేరాల నియంత్రణ, 24/7 సిటిజన్ సర్వీసెస్, సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారిస్తున్నామన్నారు. 

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి, న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. మాదన్నపేట పరిధిలో సున్నిత ప్రాంతాల్లో పికెట్లు, సీసీటీవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీలు అపూర్వ రావు, చైతన్య కుమార్, అదనపు డీసీపీ కె.శ్రీకాంత్, ఏసీపీ వెంకట్ రెడ్డి, ఇన్​స్పెక్టర్లు అంజనేయులు, శ్రీను నాయిక్‌‌‌‌లు ఉన్నారు.