- సీపీ విజయ్ కుమార్
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 8 నుంచి 24వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ విజయ్ కుమార్ అన్నారు. అప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. అత్యవసరమైతే ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు.
బంద్ ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని, మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే ఏసీపీ అధికారుల అనుమతి పొందాలని సూచించారు.
