మహిళా దినోత్సవానికి సిటీపోలీస్ ప్రత్యేక ఏర్పాట్లు..

మహిళా దినోత్సవానికి సిటీపోలీస్ ప్రత్యేక ఏర్పాట్లు..

సిటీ పోలీస్ తరపున  ఈనెల 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి పలు కార్యక్రమాలు జరుపనున్నట్లు తెలిపారు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. దీంతో పాటు… షీటీమ్స్ ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నందున పాతబస్తీ చార్మినార్ వద్ద ‘5కే రన్ ఫర్ ఉమన్ సేఫ్టీ’ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చీఫ్ గెస్ట్ గా పాల్గొననున్నారని తెలిపారు. కోటీ ఉమెన్స్ కాలేజ్ లో కూడా ఉమెన్స్ డే సందర్భంగా పలు కార్యక్రమాలు ఉండనున్నాయని చెప్పారు.

డయల్ 100, మహిళా భద్రత, షీ టీమ్స్ గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అంజనీ కుమార్. గడిచిన రెండు నెలల్లో 90కేసులు మహిళల వేదింపులపై నమోదయ్యాయని ఆయన చెప్పారు. 270 పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. గత రెండు నెలల్లో 28రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. 40శాతం రోడ్డు ప్రమాదలు తగ్గాయని.. పిడి యాక్టు కేసు విషయంలో రెండు నెలల్లో 22 మంది  రిపిటెడ్ నిందితులకు పీడీ యాక్టు విదించామని తెలిపారు. మరో 22మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరిలించామని అన్నారు. ఉమెన్ సేఫ్టీ విషయంలో గత రెండు నెలల్లో 4 అత్యాచారాల కేసులలో 4గురు నిందితులకు శిక్ష ఖరారు అయిందని తెలిపారు. ఉమెన్స్ డే సందర్భంగా సిటీ పోలీస్ నిర్వహించే కార్యక్రమాలలో మహిళలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాట్లు అంజనీ కుమార్ చెప్పారు.