- సిటీ సీపీ సజ్జనార్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య భద్రతే లక్ష్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఒక్క పోలీసుకూ వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రత్యేకంగా వారి ‘హెల్త్ ప్రొఫైల్స్’ సిద్ధం చేయనున్నట్లు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
రిపోర్టుల ఆధారంగా వారిని ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా విభజించి, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా జాగ్రత్తలు, చికిత్స అందేలా చూస్తామన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా సోమవారం పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్ క్వార్టర్స్ లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.
24 ఏండ్ల తర్వాత కొత్వాల్ హౌజ్‌లో..
సీపీ సజ్జనార్ పాతబస్తీలోని కొత్వాల్ హౌజ్‌లో కూడా జెండా ఎగురవేశారు. 2002 తర్వాత కమిషనర్హోదాలో ఓ ఆఫీసర్జెండా ఎగరవేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, అడిషనల్డీసీపీ మజీద్, టాస్క్ఫోర్స్అడిషనల్డీసీపీ అందె శ్రీనివాస రావు పాల్గొన్నారు. సైబరాబాద్‌లో సీపీ రమేశ్, జాతీయ జెండా ఎగరవేశారు.
ఇటీవల నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా ప్రాణాలకు తెగించి సెల్లార్లో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నించిన దినేశ్, మహ్మద్జకీర్, కలీం, రహీం, అమర్ తో పాటు చొరవ చూపిన కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జాఫర్ ఖాన్ కు సీపీ అభినందనలు తెలిపారు.
