భావప్రకటన స్వేచ్ఛను TRS ప్రభుత్వం హరిస్తుంది

భావప్రకటన స్వేచ్ఛను TRS ప్రభుత్వం హరిస్తుంది

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల భావ ప్రకటన స్వేచ్చను హరిస్తుందని పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. సోషల్ మీడియాలో ప్రశ్నించిన ఓ ప్రభుత్వోద్యోగిని సస్పెండ్ చేయడం టీఆర్ఆస్ నాయకులు నిరంకుశ వాదానికి నిదర్శనమన్నారు.

నాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా జాబ్ చేస్తున్న లతీఫ్ ఖాన్.. సివిల్ లిబర్టిస్ మానిటరింగ్ ( పౌర స్వేచ్చల) కమిటీ అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిదన్నారు. అతనిపై  తీవ్రవాద ముద్ర వేసి… అన్యాయంగా జైళ్లలో నిర్బంధించారని నారాయణ మండిపడ్డారు.

ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం లతీఫ్ ఖాన్ సస్పెన్షన్ ఎత్తివేయాలని… లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామిక వాదులను ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.