వ్యవసాయ చట్టాలను కొంత కాలం నిలిపివేస్తారా?

వ్యవసాయ చట్టాలను కొంత కాలం నిలిపివేస్తారా?

ఢిల్లీలో రైతుల ఆందోళనలు, అగ్రిచట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది సుప్రీంకోర్టు. అగ్రి చట్టాలను కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టగలరా అని కేంద్రాన్ని ప్రశ్నించింది.  సీజేఐ బోబ్డే నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్లను విచారించింది. రైతులతో కేంద్రం ఏం చర్చలు జరుపుతుందో అర్ధం కావట్లేదని తెలిపింది. వీటన్నింటికి కేంద్ర ప్రభుత్వమే బాద్యత వహించాలని తెలిపింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ముసలివాళ్లు, మహిళలు ఉద్యమంలో పాల్గొంటున్నారంది సుప్రీం… అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని తెలిపింది.  ఏదైనా తప్పు జరిగితే అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు సీజేఐ. ఆందోళనలు ఎక్కడా కొనసాగించాలో రైతులే నిర్ణయించుకోవాలని సూచించింది.

మహిళను బైక్ తో ఢీ కొట్టి తొక్కించి హత్య