శభాష్ దివ్య.. ఇంటికెళ్లి అభినందించిన సీజేఐ

శభాష్ దివ్య.. ఇంటికెళ్లి అభినందించిన సీజేఐ

నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌‌‌‌‌‌‌‌.. శనివారం ఫిడే చెస్ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ను నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబంతో పాత పరిచయాలను గుర్తు చేసుకున్నారు. అమరావతిలోని సంత్‌‌‌‌‌‌‌‌ గాడ్గే బాబా యూనివర్సిటీకి వైస్‌‌‌‌‌‌‌‌ చాన్సలర్‌‌‌‌‌‌‌‌గా పని చేసిన దివ్య తాత దివంగత డాక్టర్‌‌‌‌‌‌‌‌ కేజీ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌తో గవాయ్‌‌‌‌‌‌‌‌ తండ్రికి సన్నిహిత సంబంధాలున్నాయి.

 ‘నా తండ్రి, కేజీ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ మంచి సన్నిహితులు. మేం ఒకే ఫ్యామిలీలా పెరిగాం. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను 50–55 ఏళ్లు వెనక్కి వెళ్లి ఆ పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకున్నా. ముఖ్యంగా మనందర్ని గర్వపడేలా చేసిన దివ్యకు నా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చా’ అని సీజేఐ గవాయ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఏం దేవేంద్ర ఫడ్నవిస్‌‌‌‌‌‌‌‌.. దివ్యను సత్కరించారు. ఈ సందర్భంగా రూ. 3 కోట్ల క్యాష్‌‌‌‌‌‌‌‌ రివార్డును ఆమెకు అందజేశారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం వెల్లడించారు.