హెచ్ఐఎమ్సీ భవనానికి సీజేఐ రమణ భూమి పూజ

హెచ్ఐఎమ్సీ భవనానికి సీజేఐ రమణ భూమి పూజ

గచ్చిబౌలి: హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు. హైటెక్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఐఎమ్సీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. సింగపూర్లాగే హైదరాబాద్ కేంద్రం కూడా అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ఐఎమ్సీ భవనానికి భూమిని కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏడాదిలోపు భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమాకోహ్లీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, హెచ్ఐఎమ్సీట్రస్టీలు స్రుపీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగే శ్వర్ రావు, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయ మూర్తి జస్టిస్ ఆర్వీ రవీంర్ దన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

గవర్నర్‌ను కలిసిన భగవంత్ మాన్

ఖైదీలకు సుశీల్ కుమార్ రెజ్లింగ్ పాఠాలు