న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకమే ప్రజాస్వామ్యానికి బలం

న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకమే  ప్రజాస్వామ్యానికి బలం

కోర్టులు సమాజానికి చాలా ముఖ్యమన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం.. ప్రజాస్వామ్యానికి చాలా బలాన్నిస్తోందన్నారు. కానీ.. మౌలిక వసతుల విషయంలో న్యాయవ్యవస్థను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. శిథిలమైన నిర్మాణాల్లోనే కోర్టులు నడుస్తాయనే మైండ్ సెట్ తోనే ఇలా జరుగుతోందన్నారు ఎన్వీ రమణ. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కోసం ఓ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మౌలికవసతుల అంశంపై చర్చించాలని న్యాయశాఖ మంత్రిని కోరానన్నారు. బాంబే హైకోర్టు.. ఔరంగాబాద్ బెంచ్ భవనం ఓపెనింగ్ లో ఆయన మాట్లాడారు.