హీరోయిన్ మిస్సింగ్ పై క్లారిటీ.. మూవీ ప్రమోషన్ కోసమేనా ఈ డ్రామా?

హీరోయిన్ మిస్సింగ్ పై క్లారిటీ.. మూవీ ప్రమోషన్ కోసమేనా ఈ డ్రామా?

రాహు సినిమా హీరోయిన్ మిస్సింగ్ అయిందంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ విషయంలో ఆ సినిమా హీరోయిన్ క్రితి గార్గ్ వివరణ ఇచ్చుకుంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపింది. ఇందుకు గాను ఓ వీడియోను రిలీజ్ చేసింది. సోమవారం పొద్దున్నే తాను ముంబైకు చేరుకున్నానని… ప్రస్తుతం తన ఇంట్లోనే ఉన్నానని తెలిపింది. అయితే వర్క్ స్ట్రెస్ వలన తాను మొబైల్ లో అందుబాటులో లేనని చెప్పింది. ఇందులో బాగంగానే రాహు మూవీ డైరెక్టర్ సుబ్బు ఫోనే చేసినపుడు తాను అందుబాటులో లేకపోవడం వలన ఆయన టెన్షన్ పడి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పింది. అయితే తాను ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నానని తెలిపింది హిరోయిన్ క్రితి. అయితే అజ్ఞాత వ్యక్తి కాల్ చేశారు అని పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్శకుడు సుబ్బు నుంచి ఇంకా వివరణ రాలేదు. అయితే కొందరు రాహు మూవీ ప్రమోషన్ కోసమే ఇలా చేశారని అంటున్నారు.