ములుగు, వెలుగు: మల్లంపల్లి మండల కేంద్రంలో సోమవారం నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. మండలంలోని మహ్మద్ గౌస్ పల్లి గ్రామానికి చెందిన పది వార్డులు, సర్పంచ్ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకునే సందర్భంలో, ఎక్కువ మంది లోపలికి రావొద్దంటూ పోలీసులు నిలువరించారు.
ఈక్రమంలో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు జోక్యం చేసుకొని సముదాయించారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల్లో మంగళవారంతో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది.
