నాంపల్లిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు మధ్య ఘర్షణ

నాంపల్లిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు మధ్య ఘర్షణ

నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఉద్రిక్త  నెలకొంది.  ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ అక్కడికి రాగా, ఆయనను స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.  దీంతో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు మధ్య ఘర్షణ నెలకొంది.  ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.  ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చింది.  ప్రభుత్వ నిర్లక్షం వలనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు.  

నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న ఓ నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ లో నవంబర్ 13వ తేదీన  ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.  గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.  ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.