
కూసుమంచి, వెలుగు: పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను అడ్డుకునేందుకు యత్నించిన హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై జగదీశ్తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం తిరుమలాయపాలెం మండలం గోల్తండాకు చెందిన బోడ కీర్తన అదృశ్యమైనట్లు ఆమె పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.
ఇదిలాఉంటే ఆమె మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం కొత్త తండాకు చెందిన ఆంగోత్ నవీన్ప్రేమించుకొని పెండ్లి చేసుకున్నారు. సోమవారం వారు పోలీస్‌స్టేషన్‌కు రాగా, అమ్మాయి, అబ్బాయి బంధువులు ఘర్షణకు దిగారు. వారిని విడిపించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గుగులోతు నవీన్ ను తోసి వేయడంతో తల గోడకు తగిలి తీవ్రగాయాలయ్యాయి.