మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా బోనకల్మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ , బీఆర్ఎస్, సీపీఎం కూటమి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆళ్లపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, -సీపీఎం కూటమి అభ్యర్ధి సర్పంచ్‌గా విజయం సాధించారు. వారు సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌నాయకుడు మల్లాది లింగయ్య మంగళవారం తన ఇంటి ముందు నిలబడి తిడుతుండగా బీఆర్ఎస్, సీపీఎం కూటమి నాయకులు ఎవరిని తిడుతున్నావని ప్రశ్నించిన క్రమంలో ఘర్షణ వాతావారణం చోటు చేసుకుంది.
ఈ ఘర్షణకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులు మల్లాది లింగయ్య, ఉపేందర్, కొండ, వెంకయ్య బీఆర్ఎస్, సీపీఎం కూటమి నాయకులు శ్రీకాంత్ పవన్, ఉదయ్‌కిరణ్, చెన్నకేశి వేణుపై దాడి చేయగా గాయాలైనట్లు బాధితులు బోనకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బోనకల్లు ఎస్సై పొదిలి వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
