బండి సంజయ్ టూర్‌‌ లో మరోసారి ఉద్రిక్తత

బండి సంజయ్ టూర్‌‌ లో మరోసారి ఉద్రిక్తత

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రెండో రోజు టీఆర్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల ఐకేపీ సెంటర్ లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించేందుకు సంజయ్ వెళ్లగా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు రాళ్లు, చెప్పులు, కర్రలు విసురుకున్నారు. అర్వపల్లి దగ్గర పోలీసులపైకి దూసుకెళ్లారు TRS కార్యకర్తలు. కర్రలతో పోలీసులపై దౌర్జన్యం చేశారు. తమనే అడ్డుకుంటారా అంటూ కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులను అక్కడ్నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు TRS కార్యకర్తలు. దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లను వెంటనే  పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 

 బండి సంజయ్ పర్యటన సందర్బంగా ఆత్మకూరు(s) మండలం కొనుగోలు కేంద్రం వద్ద  విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇనస్పెక్టర్ సీఐ శ్రీనివాస్‌ అస్వస్థతకు గురయ్యారు. సూర్యపేట ఆస్పత్రిలో శ్రీనివాస్ కు చికిత్స అందిస్తున్నార ఉదయం నుండి విధులు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్.