ట్యాంక్ బండ్ వద్ద పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట

ట్యాంక్ బండ్ వద్ద పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వందలాది మంది VRA లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన వీఆర్ఏలను పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తతంగా మారింది. అరెస్టు చేసిన వీఆర్ఏలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర 200 మంది వీఆర్ఏలను ఇప్పటికే అరెస్టు చేయగా... అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తాన్ని పోలీసులు బ్లాక్ చేశారు. అందులో భాగంగా నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి మళ్సిస్తున్నారు. సీఎం రూట్ అంతా పోలీసుసు క్లియర్ చేస్తున్నారు. ప్రగతిభవన్ నుంచి అసెంబ్లీ వెళ్లే రూట్ లో ఉన్న హోటల్స్, షాప్స్ ని  పోలీసులు ఇప్పటికే మూసివేయించారు. ఈ రోజు ఏడు సంఘాలు ఛలో అసెంబ్లీ పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని... వీఆర్ఏల కుటుంబలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 41 రోజులుగా వీఆర్ఏ లు నిరవదిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు 32 మంది వీఆర్ఏలు చనిపోయారని, అయిన ప్రభుత్వం స్పందించల్లేదన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ను దిగ్భంధం చేస్తామని ఆయన హెచ్చరించారు.