చిచ్చర పిడుగు.. చిన్నవయసులోనే 10th క్లాస్ ఎగ్జామ్స్

చిచ్చర పిడుగు.. చిన్నవయసులోనే 10th క్లాస్ ఎగ్జామ్స్

అస్సాంలో ఓ బాలుడు 12 ఏళ్ల వయసులోనే  10 వ తరగతి ఎగ్జామ్స్  రాసేందుకు అర్హత సాధించి రికార్డ్ సృష్టించాడు. చురాచంద్‌పూర్ జిల్లాలోని కాంగ్‌వై గ్రామానికి చెందిన ఐజాక్ పౌలలుంగ్‌మువాన్ వైఫే అనే 12 ఏళ్ల బాలుడు అస్సాంలో 10 క్లాస్ ఎగ్జామ్స్ రాయనున్నాడు. ఐజాక్ పదో తరగతి ఎగ్జామ్స్ రాసేందుకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆమోదం తెలిపింది.  వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్ కోసం తన పేరు అసలైన పుట్టిన తేదీని నమోదు చేసుకోవాలని ఐజాక్ కు అనుమతిచ్చింది బోర్డ్. ఐజాక్ 8 వ తరగతి వరకు మౌంట్ ఆలివ్ స్కూల్లో చదివాడు. ఐజాక్ తండ్రి పేరు జెన్ఖోలియన్ వైఫీ.. అతనికి ఐజాక్ పెద్ద కుమారుడు.

10 క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి ఐజాక్ తండ్రి విద్యాశాఖ అనుమతి కోరుతూ గత సంవత్సరం అప్లై చేశారు. అయితే ఐజాక్ సైకాలజీ పరిశీలించాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు.దీంతో  ఐజాక్ సైకాలజీ టెస్టులు చేయగా అతని మానసిక వయసు 17 సంవత్సరాల 5 నెలలు ఉన్నట్లుగా గుర్తించారు. ఐజాక్ ఐక్యూ 141 గా తేల్చారు.  దీంతో ఐజాక్ 10 వతరగతి ఎగ్జామ్ రాసేందుకు  బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ అనుమతి ఇచ్చింది. ఐజాక్ తండ్రి జెన్‌కోలియన్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కుమారుడి నైపుణ్యం గుర్తించి ఈ అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.