కరోనా కారణంగా 9, 10, ఇంటర్‌ విద్యార్థులకే క్లాసులు

కరోనా కారణంగా 9, 10, ఇంటర్‌ విద్యార్థులకే క్లాసులు

సెప్టెంబరు 5 నుంచి ఆంధ్రప్రదేశ్ లో  విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతానికి 9, 10, ఇంటర్‌కు మాత్రమే తరగతులు ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నాయి సంక్షేమ గురుకులాలు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సెప్టెంబరు 5 నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్యను కుదించి తరగతులు నిర్వహించేందుకు సంక్షేమ గురుకులాలు ప్రతిపాదనలు రూపొందించాయి. ప్రస్తుతానికి 9, 10, ఇంటర్‌కు మాత్రమే తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నాయి. 5, 6, 7, 8 తరగతులను దశలవారీగా మొదలుపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇందులో బాగంగా గురుకులాల్లో ఒక్కో తరగతిని నాలుగు సెక్షన్లుగా చేసి ఒక్కోదాంట్లో 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు చేపట్టారు అధికారులు.