హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కు రమ్మని పిలిచి యువతిపై ఆమె క్లాస్ మేట్ దాడికి దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లి పోలీస్ట్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ తీవ్ర కలకలం రేపింది. ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి యువతిపై బ్లేడ్ తో దాడి చేయడంతో.. తీవ్ర గాయాలపాలైన యువతి ఆస్పత్రి పాలైంది.
వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగింది ఈ ఘటన. రాత్రి 11 గంటల సమయంలో.. మెట్రో స్టేషన్ కు రమ్మని చెప్పి యువతిపై బ్లేడ్ తో దాడి చేశాడు ఎండీ. మొహ్సిన్ అనే యువకుడు.
చదువుకునే సమయంలో స్నేహితుడిగా ఉన్న ఎండీ మొహ్సిన్ తో ప్రేమ లో పడ్డ యువతి.. ప్రతి చిన్న విషయానికి గొడవలు తలెత్తుతుండటంతో దూరంగా పెట్టినట్లు చెప్పింది. దీంతో ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో కాల్ చేసి మూసాపేట్ మెట్రో స్టేషన్ కు రమ్మని పిలిచాడు ఎండీ. మొహ్సిన్.
రాత్రి 11 గంటలకు మెట్రో స్టేషన్ వద్దకు వచ్చిన యువతితో మరోసారి గొడవకు దిగాడు ఎండీ. మొహ్సిన్. నాతో మాట్లాడతావా లేదా అంటూ గట్టిగా వాదించి.. తనతో తెచ్చుకున్న బ్లేడ్ తో దాడి చేశాడు మొహ్సిన్.
బ్లేడ్ తో దాడి చేయడంతో యువతి కడుపు పైన తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు పక్కనే ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
