హైదరాబాద్లో పొద్దున ఎండ.. సాయంత్రం వాన

హైదరాబాద్లో పొద్దున ఎండ.. సాయంత్రం వాన

హైదరాబాద్ సిటీ/ గండిపేట, వెలుగు:హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా, సాయంత్రం 6 నుంచి ఆయా ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. బేగంపేట్ లోని పలుచోట్ల రెండు గంటల్లో 4 సెంటిమీటర్ల వర్షం కురింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది.

నీరు చేరిన ప్రాంతాల్లో హైడ్రా డీఆర్ ఎఫ్ టీమ్స్, జీహెచ్ ఎంసీ స్టాటిక్ టీమ్స్ వర్షపు నీటిని తొలగించే పనులు చేపట్టాయి. నగరంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలుకురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.మరోవైపు రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీరు మున్సిపల్‌‌ కార్పొరేషన్, హిమాయత్‌‌సాగర్, కిస్మత్‌‌పూర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట్‌‌ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.

ప్రాంతం     సెంటి మీటర్లలో (సా. 7 గంటల వరకు)
పాటిగడ్డ    4.00
గోల్కొండ    3.78
కుత్భుల్లాపూర్    3.73
కూకట్ పల్లి    3.68
షేక్ పేట    3.05