ఇన్వెస్టర్లకు అలర్ట్: వెండి టైం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. అనిల్ అగర్వాల్ కామెంట్స్

ఇన్వెస్టర్లకు అలర్ట్: వెండి టైం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. అనిల్ అగర్వాల్ కామెంట్స్

ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం కంటే వెండి అత్యధిక వేగంతో దూసుకుపోతోంది. 2025లో వెండి ధరలు నమోదు చేసిన వృద్ధి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల వెండి భవిష్యత్తుపై చేసిన ఆసక్తికర కామెంట్స్ చేశారు. వెండి కేవలం ఆభరణాల మెటల్ మాత్రమే కాదని, అది ఒక కీలకమైన 'ఫంక్షనల్ మెటల్' అని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. అసలు వెండి టైం ఇప్పుడు స్టార్ట్ అయ్యిందంటూ చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

ఇన్నాళ్లూ బంగారం నీడలో ఉండిపోయిన వెండి.. ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది డాలర్ పరంగా వెండి ఏకంగా 125% లాభాలను అందించిందని తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో బంగారం 63% వృద్ధిని మాత్రమే నమోదు చేసిందన్నారు. వెండి స్టోరీ ఇప్పుడే మొదలైందని ధీమా వ్యక్తం చేశారు. వెండికి అటు విలువతో పాటు, ఇటు పారిశ్రామికంగా ఉన్న డిమాండ్ దానిని ఒక అరుదైన లోహంగా మార్చిందని అన్నారు. 

వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం దాని పారిశ్రామిక అవసరాలేనని అగర్వాల్ వివరించారు. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో వెండి ఒక కీలక విడిభాగంగా మారిందన్నారు. భారత్‌లో వెండిని ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థగా 'హిందుస్థాన్ జింక్'లో ఈ మార్పును తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం ఒక విలువైన లోహంగా కాకుండా.. భవిష్యత్ అవసరాలకు వెండి అనివార్యమని చెప్పుకొచ్చారు.

ALSO READ : రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం..

వెండి ధరల పెరుగుదల వేదాంత గ్రూప్ ఆర్థిక ఫలితాలపై సానుకూల ప్రభావం చూపుతోంది. సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో హిందుస్థాన్ జింక్ సాధించిన మొత్తం లాభాల్లో వెండి వాటా దాదాపు 40% (సుమారు ₹1,060 కోట్లు) ఉండటం విశేషం. మరోవైపు వేదాంత గ్రూప్ ఐదు వేర్వేరు కంపెనీలుగా విడిపోయే ప్రక్రియ కూడా వేగంగా సాగుతోందని, దీనివల్ల వాటాదారులకు మరింత లబ్ధి చేకూరుతుందని అగర్వాల్ తెలిపారు. షేర్ హోల్డర్లను సంతోషపెట్టడమే నా లక్ష్యం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే రానున్న కాలంలో భారీగా పెట్టుబడులు చేయనున్నట్లు చెప్పారు.