కరోనా నాసల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం

కరోనా నాసల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కరోనా నాసల్ వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని ఆదివారం ఆ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ క్రిష్ణ ఎల్లా ప్రకటించారు. ప్రస్తుతం టీకాకు సంబంధించిన డేటా అనలసిస్ కొనసాగుతోందని, జులైలో ఆ నివేదికను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి అందజేస్తామని తెలిపారు. ఈ టీకాకు డీసీజీఐ నుంచి తుది ఆమోదం లభించగానే.. వరల్డ్ వైడ్ గా దీనిని లాంచ్ చేస్తామన్నారు. అలాగే ఇంట్రా నాసల్ కరోనా టీకాకు ఫేజ్ 3 బూస్టర్ డోస్ స్టడీ కోసం కూడా డీసీజీఐ, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. కాగా, మన దేశంలో బూస్టర్ డోస్ కు థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న రెండో కంపెనీగా భారత్ బయోటెక్​ నిలిచింది. దేశంలో ఇప్పటివరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్​ వీ కరోనా వ్యాక్సిన్​లకు మాత్రమే డీసీజీఐ ఆమోదం లభించింది.