హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని మ్యూజియంలో మలక్‌పేటకు చెందిన యూనస్ఫర్హాన్...క్లౌడ్ యానిమల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈనెల 2 ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్8వ తేదీ వరకు కొనసాగనుంది.
మేఘాల్లో జంతువుల ఆకారాలను బంధించి తీసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఫర్హాన్మాట్లాడుతూ ప్రపంచంలో వైల్డ్ లైఫ్ సంబంధించిన ఎన్నో ఫోటో ఎగ్జిబిషన్లు పెట్టారని, కానీ, మేఘాలలో జంతువుల ఆకారాలను బంధించి తీసిన ఫొటోలు ఇక్కడ ప్రత్యేకమన్నారు. జూపార్క్క్యూరేటర్సునీల్హిరేమత్సహకారంతోత ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.