
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మోడీకి సైంటిఫిక్ ఆలోచన లేదని అన్నారు. కరోనా వస్తే చప్పట్లు కొట్టండి.. దీపాలు వెలిగించండని సలహాలు ఇచ్చాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపు విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి తక్కువ నిధులు కేటాయించిందని భట్టి ఆరోపించారు. పోడు భూములకు వీలైనంత త్వరగా పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రిజ్ చేయడం వల్లే సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని భట్టి విమర్శించారు. అలాగే.. పేద ప్రజలకు వంద గజాల జాగ ఇచ్చే జీవోను తీసుకువాలని భట్టి విక్రమార్క అన్నారు.