వైసీపీ పాలనలో వేధింపులకు గురైన మహిళకు సీఎం చంద్రబాబు అభయహస్తం..

వైసీపీ పాలనలో వేధింపులకు గురైన మహిళకు సీఎం చంద్రబాబు అభయహస్తం..

వైసీపీ హాయంలో వేధింపులకు గురైన ఆరుద్రను సీఎం చంద్రబాబు ఆదుకున్నారు.తన కుమార్తె సాయి లక్ష్మితో కలిసి చంద్రబాబును కలిసిన ఆరుద్రకు 5లక్షల ఆర్థిక సాయం, పదివేల రూపాయల నెలవారీ పెన్షన్ ను ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం తనను ఎంతగానో వేధించిందని, తన కూతురు తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతోందని ఆరుద్ర సీఎంకు తన గోడు విన్నవించుకున్నారు. తన కూతురు సాయిలక్ష్మి విజాడ్యం కోసం భూమిని అమ్మటానికి ప్రయత్నించగా వైసీపీ నాయకులు గురి చేసిన వేధింపుల గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు ఆరుద్ర.

వైసీపీ నాయకుల వేధింపుల వల్ల అమలాపురం కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చిందని అన్నారు ఆరుద్ర. గత ప్రభుత్వంలో సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తే అనుమతించకపోగా తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని తెలిపింది. ఆరుద్ర ఆవేదన విని చలించిన సీఎం ఆర్థిక సాయం అందించి ఆమె ఎదుర్కొంటున్న కోర్టు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు.