31మందిని చంపిన హంతకుడు చంద్రబాబు - సీఎం జగన్

31మందిని చంపిన హంతకుడు చంద్రబాబు - సీఎం జగన్

ఏపీలో ఇంటింటికీ పెన్షన్ పంపిణీ రద్దు అంశం రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యం  వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకు పెన్షన్ పంపిణీ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటివద్దకు పెన్షన్ రాకపోవటంతో వృద్దులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ అందలేదని కొంతమంది, పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ వడదెబ్బకు గురై మరికొంత మంది వృద్దులు ప్రాణాలు వదులుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు సహించలేకపోతున్నాడని, అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా అడ్డుపడ్డాడని అన్నారు. 31మందిని చంపిన చంద్రబాబును ఏమనాలి, హంతకుడు అనాలా?, లేక అంతకన్నా దారుణమైన పదం వాడాలా అని అన్నారు.చంద్రబాబు లాగా మోసాలు చేయటం తనకు చేతకాదని, సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో చెబుతానని, మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా అమలు చేస్తానని అన్నారు.