ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే అని అన్నారు. చంద్రబాబుది ఎప్పుడూ అడ్డదారే అని, ప్రజలకు మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేక తన మనిషి అయిన నిమ్మగడ్డ చేత ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లు రాకుండా అడ్డుకున్నాడని అన్నారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయని అన్నారు.
56నెలలుగా అందుతున్న పెన్షన్లను చంద్రబాబు అర్దాంతరంగా ఆపించేశాడని అన్నారు. 58నెలల పాలనలో జగన్ మార్క్ కనిపించిందని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తురాదని, వెన్నుపోటు మాత్రమే గుర్తొస్తుందని అన్నారు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు అని మండిపడ్డాడు సీఎం జగన్.తమ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి గురించి చెప్పినందుకు చంద్రబాబు మనుషులతో సోషల్ మీడియాలో వేధించి చంపారని అన్నారు.