మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారా లోకేష్ సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఏపీని అప్పులకుప్పగా మార్చాడని మండిపడ్డారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎంల లిస్ట్ లో జగన్ మొదటి స్థానంలో ఉంటాడని ఎద్దేవా చేశారు.తమ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తీ చేస్తే, జగన్ సర్కార్ ఇప్పటివరకూ పూర్తీ చేయలేదని, అసలు పనులు ఎంతవరకు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఉద్యోగుల సీపీఎస్, ఓపిఎస్ ల గురించి ఉద్యమిస్తున్నామని, తర్వాత వీటి గురించి మాట్లాడతామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చాక దశలవారీగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తామని అన్నారు.అధికారంలోకి వచ్చాక పోలవరం పూర్తీ చేస్తామని అన్నారు.అభివృద్ధి సంక్షేమం సమంగా పాటిస్తామని అన్నారు లోకేష్.