
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదాయ వనరులు సమకూర్చే శాఖలపై సమీక్ష జరిపారు. సుమారు గంటకుపైగా సమావేశం జరిగింది. ఈ సమీక్షలో మద్యపాన నిషేధాన్ని దశాలవారి అమలుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మద్యపానం అంటే నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రెవెన్యూను పెంచుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులకు వైఎస్ జగన్ సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి. సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. నేటి నుంచి సీఎం శాఖలవారీగా సమీక్షలు జరపనున్నారు. ఇవాళ ఆర్థిక, రెవెన్యూశాఖలపై.. ఈ నెల 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం జలవనరులశాఖపై సమీక్ష జరగనుంది. 4న ఉదయం వ్యవసాయ అనుబంధరంగాలపై, 4న మధ్యాహ్నం గృహనిర్మాణశాఖపై.. ఈ నెల 6న సీఆర్డీఏపై సీఎం జగన్ సమీక్షలు జరపనున్నారు.