కేజీహెచ్ ఆస్పత్రికి జగన్: గ్యాస్ బాధితులకు పరామర్శ

కేజీహెచ్ ఆస్పత్రికి జగన్: గ్యాస్ బాధితులకు పరామర్శ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం జగన్ ‌అధికారులను ఆదేశించారు.  అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలందిస్తానని భరోసా ఇచ్చారు  జగన్.

ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. రసాయనక గ్యాస్‌  భారీగా లీక్ అవ్వడంతో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.