గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి ఇవాళ(గురువారం) కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో జగన్ దంపతులు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత వీళ్లిద్దరూ కొద్దిసేపు అబ్జర్వేషన్‌లో ఉన్నారు.సీఎం జగన్‌కు టీకా వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో కేంద్ర ప్ర‌భుత్వ మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సిన్ వేసే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పిన సీఎం.. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని  పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కేవ‌లం మూడు నెలల్లో ఈ‌ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామ‌ని తెలిపారు సీఎం జగన్. గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ వేసే విష‌యంపై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వాలంటీర్లు గ్రామాల్లో ప్ర‌తి ఇంటికీ వెళ్లి 45 ఏళ్లు దాటినవారి వివరాలను తీసుకుంటార‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఏయే రోజు వ్యాక్సిన్ వేస్తారు..ఎప్పుడు వెళ్లాల‌నే అంశాల‌ను వివ‌రించి చెబుతార‌ని అన్నారు. రాష్ట్రంలోని ప్ర‌తి మండలంలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.