ఇంటర్‌ విద్యార్దులకూ అమ్మ ఒడి పథకం

V6 Velugu Posted on Jun 27, 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం అమలుపై సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఇంటర్‌ విద్యార్ధులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ బడికి ప్రతి విద్యార్ధి తల్లికి రూ. 15 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అమ్మ ఒడిని ఇంటర్‌ విద్యార్ధులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్ధులకూ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. తెల్లరేషన్‌ కార్డును ఆదారంగా తీసుకుని ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించారు.

Tagged AP, review meeting, Inter Students, CM Jagan, ammaodi scheme

Latest Videos

Subscribe Now

More News