వెలిగొండ ప్రాజెక్ట్: 20ఏళ్ళ కల నెరవేరిన వేళ... ఆ మూడు జిల్లాల్లో జలకల..!

వెలిగొండ ప్రాజెక్ట్: 20ఏళ్ళ కల నెరవేరిన వేళ... ఆ మూడు జిల్లాల్లో జలకల..!

2004లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్ట్ 20ఏళ్ళ తర్వాత పూర్తయ్యి ప్రారంభానికి నోచుకుంది. ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తీ చేసిన సీఎం జగన్ జాతికి అంకితం ఇచ్చాడు. తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును కొడుకు సీఎం హోదాలో పూర్తీ చేయటం ఒక అరుదైన సంఘటన అని చెప్పచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో నీటి ఎద్దడి తీరనుంది. శ్రీశైలం నుండి 18కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగిన రెండు టన్నెల్ల ద్వారా నల్లమల్ల సాగర్ కు నీటిని తరలిస్తారు.

Also read : చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ సాధ్యమేనా..?

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 15.25లక్షల మందికి తాగునీటి సమస్య తీరనుంది.అంతే కాకుండా మూడు జిల్లాల్లోని 4లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్స్ గా ఈ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించింది ఈ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరిందని, తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును ఆయన కొడుకులా ప్రారంభించటం తనకు గర్వంగా ఉందని అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు జగన్. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్ జాతికి అంకితం ఇచ్చాడు.