
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమానాశ్రాయానికి వెళ్లినపుడు తన కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడడం ఆయన గమనించారని అధికార వర్గాలు చెప్పాయి. దీంతో సీఎం.. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదని , అందుకు తగ్గ ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని పోలీసు, సీఎంవో అధికారులకు ఆదేశాలిచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోలీస్, భద్రతా అధికారులు అన్వేషిస్తున్నారు.