అంతర్జాతీయ మ్యాప్‌లోకి గండికోట ఎక్కుతది: జగన్

అంతర్జాతీయ మ్యాప్‌లోకి గండికోట  ఎక్కుతది: జగన్

గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుందన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.  కడప  జిల్లా గండికోటలో  ఒబెరాయ్ హోటల్స్ నిర్మించనున్న సెవెన్ స్టార్ హోటల్ కు  సీఎం జగన్  భూమి పూజ చేశారు. ఈ  కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, భాషా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ .. ఒబెరాయ్ హోటల్ నిర్మాణంతో వెయ్యి మందికి ఉద్యోగాలొస్తాయని అన్నారు. గండి కోటకు మరో స్టార్ గ్రూప్ ను కూడా తీసుకొస్తామన్నారు. గండికోట ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందన్నారు. స్టార్ గ్రూపుల్ రాకతో గండికోటను టూరిజం మ్యాప్ లోకి తీసుకెళ్తామన్నారు.  

తిరుపతి, అన్నవరంలో ఒబెరాయ్ సంస్థ సెవెన్ స్టార్ హోటల్స్  నిర్మించనుంది. తిరుపతిలో నిర్మించనున్న ఈ హోటల్ కు రూ.300 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.  10 అంతస్తుల భవనంలో 200 గదులు, స్విమ్మింగ్ పూల్,  హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా సకల సౌకర్యాలు  కల్పించనున్నారు. హోటల్ నిర్మాణం పూర్తయితే 1000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం.