
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్కడ్నుంచి ప్రగతిభవన్‌కు సీఎం బయల్దేరారు. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌కు డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. అయితే ఆయనకు ఎలాంటి సమస్యల్లేవని.. అంతా బాగుందని డాక్టర్లు చెప్పారు. కరోనరి యాంజియోగ్రామ్ మొదలుకుని ఈసీజీ, టూడీ ఈకో, మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ ఇలా కేసీఆర్‌కు అన్ని పరీక్షలు చేశారు. పరీక్షల తర్వాత వైద్య బృందం మీడియాతో మాట్లాడారు. వరుస పర్యటనలతో నీరసంగా ఉంటున్నారని.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు సూచించామన్నారు డాక్టర్లు.