ఆర్టీసీ కార్మికులు మాబిడ్డలు..తక్షణమే విధుల్లోకి చేరండి: కేసీఆర్

ఆర్టీసీ కార్మికులు మాబిడ్డలు..తక్షణమే విధుల్లోకి చేరండి:  కేసీఆర్

ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని కేసీఆర్ ఆదేశాలు చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యకు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పొట్టనింపిందే తప్పా..పొట్టకొట్టలేదన్నారు. అందుకు ఉదాహరణ హోంగార్డ్ లకు , ఆశా వర్కర్లు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట నమ్మి లేనిపోని టెన్షన్లకు గురవుతున్నారని చెప్పారు.  

ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు యూనియన్లను వదిలేయాని సూచించారు. రేపు ఉదయమే ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని, ఎటువంటి షరతులు లేకుండా లిఖితపూర్వమైన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. తక్షణమే ఆర్టీసీ కోసం రూ.100కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ లాభాలపంట పండించేలా వచ్చే సోమవారం నుంచి కిలోమీటర్ కు 20పైసలు పెంచుతున్నట్ల తెలిపారు. తద్వారా  750కోట్లు అదనపు ఆదాయం వస్తుందన్నారు. సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.