యాదాద్రి జిల్లాకు కోట్ల నిధులు ప్రకటించిన కేసీఆర్

యాదాద్రి జిల్లాకు కోట్ల నిధులు ప్రకటించిన కేసీఆర్

దత్తత గ్రామం వాసాలమర్రికి సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఆ గ్రామానికే కాకుండా.. జిల్లాలోని మిగతా గ్రామాలకు కూడా నిధులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 421 గ్రామాలుండగా.. ఒక్కొక్క గ్రామానికి 25 లక్షల రూపాయల నిధులిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మున్సిపాలిటిలకు కూడా నిధులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం ఆరు మున్సిపాలిటీలుండగా.. భువనగిరి మున్సిపాలిటికి కోటి రూపాయలు.. మిగతా మున్సిపాలిటీలైన యాదగిరి గుట్ట, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, భూదాన్ పోచంపల్లిలకు 50 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదలచేస్తున్నట్లు ప్రకటించారు.