
పెద్దపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు ప్రత్యేక హెలికాప్టర్ లో పెద్దపల్లి జిల్లా గోలివాడ పంప్ హౌస్ కు చేరుకున్నారు. ఏరియల్ సర్వే ద్వారా గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని సీఎం పర్యవేక్షించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజి నుండి గోలివడా వద్ద నిర్మించిన సుందిళ్ళ పంప్ హౌస్ కు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఏరియల్ సర్వే నిర్వహించి, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.