
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దిన కర్మలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ రోడ్డులోని శాంతమ్మ సమాది దగ్గర నివాళులు అర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ అలి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్.. జిల్లా ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు.