టీఆర్ఎస్ సభపై రైతులతో చర్చించిన పార్టీ నేతలు

టీఆర్ఎస్ సభపై రైతులతో చర్చించిన పార్టీ నేతలు

టీఆర్ఎస్ విజయగర్జన సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు నేతలు. వ్యవసాయ భూములు, ప్లాట్లలో సభ పెడుతామంటే ఒప్పుకోమంటున్న రైతులను బుజ్జగించే పనిలో పడ్డారు టీఆర్ఎస్ నేతలు. హనుమకొండ జిల్లాలో దేవన్నపేటలో సభకు భూములు ఇచ్చేందుకు అభ్యంతరం తెలుపుతున్న రైతులతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం అయ్యారు. రైతులు చెబుతున్న అభ్యంతరాలను విని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ప్లాట్లు, భూముల హద్దులు చెడిపోకుండా చూస్తామన్నారు. ఎలాంటి పంటనష్టం జరిగినా పరిహారం ఇప్పించే బాధ్యత తనదంటున్నారు ఎమ్మెల్యే రమేష్. సభ జరిగిన తర్వాత ప్లాట్లు, వ్యవసాయ భూముల హద్దులు సరిచేయిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని చెప్పారు. రైతులతో మంతనాలు జరిపి అందరినీ ఒప్పించామని ఎమ్మెల్యే రమేష్ చెప్పారు. ఎలాంటి సమస్యలు వచ్చినా తామే బాధ్యత వహిస్తామంటున్నారు.

మరిన్ని వార్తల కోసం..

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ నిర్దోషి: పాక్ కోర్టు

బాలానందం కుటుంబానికి వివేక్ వెంకటస్వామి పరామర్శ

పెరిగిన ఓటు రేటు.. కాస్ట్‌లీ ఎన్నికలపై లీడర్లలో పరేషాన్